ఇండియాలో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ పోజిషన్‌లో దూసుకెళ్తోన్న ఓటీటీ సంస్థల్లో ZEE5 ఒకటి. తాజాగా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డిమోంటీ కాలనీ 2’తో మెప్పించటానికి సిద్ధమైంది. వెన్నులో వణుకు పుట్టించేలా ప్రేక్షకులను భయానికి గురి చేసిన ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసింది. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ అద్భుతమైన నటనతో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్షకులను కూర్చోపెట్టారు. తమిళ్ సినీ హిస్టరీలో ఫ్రాంచైజీగా రూపొందిన ‘డీమాంటే కాలనీ2’ రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. సెప్టెంబర్ 27నుంచి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా డిమోంటీ కాలనీ 2 ZEE5లో ప్రసారం కానుంది. సో మూవీ లవర్స్ గెట్ రెడీ.. నిద్ర లేని రాత్రి కోసం సిద్ధంగా ఉండండి.
డిమోంటీ కాలనీ 2 కథ ఏంటంటే..?
శాపభరితమైన ఓ బంగారు గొలుసును దొంగలించటానికి కొంతమంది స్నేహితులు ప్రయత్నిస్తారు. దాంతో నిద్రావస్థలోని భయంకరమైన ఆత్మ మేల్కొంటుంది. ఆ దుష్ట ఆత్మ ప్రతీకార చర్య నుంచి తమ స్నేహితులను కాపాడుకోవటానికి కొంతమంది ధైర్యవంతులైన స్నేహితులు ఏకం అవుతారు. ఘన విజయం సాధించిన ‘డిమోంటీ కాలనీ’కి కొనసాగింపుగా రూపొందింది డిమోంటీ కాలనీ 2.
తొలిభాగాన్ని మించి ఈ చిత్రం ఆసక్తికరమైన హారర్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కింది. అంతే కాకుండా తొలి భాగం కంటే కూడా భయానకమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ‘డీమాంటే కాలనీ 2’ తెరకెక్కింది. డిమోంటీ కాలనీ 2 చిత్రం ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించే అనుభవానికి గురి చేయడం ఖాయం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























