ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకలో తొలిరోజు సెప్టెంబర్ 14న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ తారలు పాల్గొని సందడి చేశారు. అలాగే వీరితోపాటు దక్షిణాది భాషలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు.
ఈ వేడుకలో ఈసారి నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. ఆయన హీరోగా నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు పలు అవార్డులు గెలుచుకోవడం విశేషం. 2024 సంవత్సరానికి గానూ ‘దసరా’ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డును అందుకున్నారు. ఇక గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రంగా నిలవగా.. సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు.
అలాగే ‘బేబి’ చిత్రం కూడా నాలుగు అవార్డులని సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) గా ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ గా సాయి రాజేష్, ఉత్తమ డెబ్యు నటి గా వైష్ణవి చైతన్య, ఉత్తమ లిరిక్స్ రైటర్ గా అనంత శ్రీరామ్ గా బేబీ చిత్రానికి గాను అవార్డులు అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లతో కనువిందు చేశారు. సెప్టెంబర్ 15న తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులను అందించనున్నారు.
సైమా అవార్డ్స్ 2024 తెలుగు విజేతలు వీరే..
- ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
- ఉత్తమ నటుడు పాపులర్: నాని (దసరా)
- ప్రముఖ ఉత్తమ నటి పాపులర్: కీర్తి సురేష్ (దసరా)
- ఉత్తమ నటి క్రిటిక్స్: మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా)
- ఉత్తమ దర్శకుడు పాపులర్: శ్రీకాంత్ ఓదెల (దసరా)
- ఉత్తమ నటుడు క్రిటిక్స్: ఆనంద్ దేవరకొండ (బేబీ)
- సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సందీప్ రెడ్డి వంగా
- ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్: సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు (మ్యాడ్) - ఉత్తమ ప్రతినాయకుడు: దునియా విజయ్ (వీర సింహారెడ్డి)
- ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా (హాయ్ నాన్న)
- ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
- బెస్ట్ డెబ్యు డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న)
- ఉత్తమ డెబ్యు ప్రొడ్యూసర్స్: వైర ఎంటర్టైన్మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న)
- ఎమర్జింగ్ యాక్టర్: సుమంత్ ప్రభాస్
- ఉత్తమ డెబ్యు నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
- ఉత్తమ డెబ్యు నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: హేషామ్ అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న)
- ఉత్తమ నేపథ్య గాయని: శక్తిశ్రీ గోపాలన్ (హాయ్ నాన్న)
- ఉత్తమ గాయకుడు: రామ్ మిర్యాల (బలగం)
- ఉత్తమ లిరిక్స్ రైటర్: అనంత శ్రీరామ్ (బేబీ)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్: భువన్ గౌడ (సలార్)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























