సైమా అవార్డ్స్ గెలుచుకున్న కన్నడ విజేతలు వీరే..!

Siima Awards 2024 Sandalwood Winners List

ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్‌ (సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్‌) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకలో తొలిరోజు సెప్టెంబర్ 14న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. సెప్టెంబర్ 15న తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులను అందించనున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ తారలు పాల్గొని సందడి చేశారు. అలాగే వీరితోపాటు దక్షిణాది భాషలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరయ్యారు.

టాలీవుడ్ నుంచి హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. కన్నడ సూపర్ స్టార్, డా. శివ రాజ్‌కుమార్‌ను ‘ఎక్సలెన్స్ ఇన్ సినిమా’ అవార్డుతో సత్కరించారు. ఇక ఈ వేడుకలో సౌత్ ఇండస్ట్రీలోని పలువురు తారలు రెడ్ కార్పెట్‌పై సందడి చేయగా.. ఎంతోమంది హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మెన్స్‌లతో కనువిందు చేశారు.

సైమా అవార్డ్స్ 2024: శాండల్‌వుడ్ విన్నర్స్ లిస్ట్..

  • ఉత్తమ చిత్రం: కాటేరా
  • ఉత్తమ నటుడు: రక్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • ఉత్తమ నటి: చైత్ర ఆచార్ (టోబీ)
  • ఉత్తమ దర్శకుడు: హేమంత్ రావు గుండు (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: నితిన్ కృష్ణమూర్తి (హాస్టల్ హుడుగారు బేకగిద్దరే)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ధనంజయ (గురుదేవ్ హోయసల)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్): రుక్మిణి వసంత్ (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • ఉత్తమ తొలి నటి: ఆరాధనా రామ్ (కాటేరా)
  • ఉత్తమ విలన్: రమేష్ ఇందిర (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: వి.హరికృష్ణ (కాటేరా)
  • ఉత్తమ నేపథ్య గాయని: మంగ్లీ (కాటేరా)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: కపిల్ కపిలన్ (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డు: శివ రాజ్‌కుమార్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.