ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుక తొలిరోజు అట్టహాసంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో సెప్టెంబర్ 14న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ తారలు పాల్గొని సందడి చేశారు. అలాగే వీరితోపాటు దక్షిణాది భాషలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 15న తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులను అందించనున్నారు.
కాగా సైమా పురస్కారాలు అని పిలవబడే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక, సాంకేతిక విజయాలకు ప్రతిఫలంగా లభించే పురస్కారాలు. ఈ వేడుకను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు ఇందూరి విష్ణువర్ధన్ 2012 లో స్థాపించాడు. అడుసుమిల్లి బృందా ప్రసాద్ దీనికి చైర్‌పర్సన్‌గా వున్నారు. ఇక ఈ యేడాది ఈవెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన సెలబ్రిటీస్ అందరికీ విష్ణు వర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ అడుసుమిల్లి ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























