రీసెంట్ గా చిన్న సినిమాలుగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు,ఆయ్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టగా ఇక ఇప్పుడు మత్తువదలరా 2 సేమ్ సీన్ రిపీట్ చేస్తుంది.మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.దాంతో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 16.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్మోస్ట్ 90 శాతం రికవరీ చేసింది.రేపటితో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుండగా ఫుల్ రన్ లో బయ్యర్లకు లాభాలను తీసుకరానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.నిన్నటితో అక్కడ 600k మిలియన్ డాలర్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఫుల్ రన్ లో 1మిలియన్ మార్క్ ను చేరుకోవడం సాధ్యమే.దేవర వచ్చే వరకు ఇంకా సమయం ఉండడంతో ఈలోగా మత్తువదలరా2,మిలియన్ డాలర్ ను చేరుకోనుంది.ఓవరాల్ గా అంచనాలకు మించి మత్తువదలరా 2 అదరగొడుతుంది.ఇందులో సత్య కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను చూసి రెస్పాండ్ కావడంతో మరింత అడ్వాంటేజ్ అయ్యింది.
రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించగా సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.కాలభైరవ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్,క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మించాయి.ఇక ఈ పార్ట్ 2 కూడా హిట్ కావడంతో మత్తువదలరా 3 కూడా రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: