NKR 21 షూటింగ్ అప్డేట్

NKR 21 shooting update

డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో ప్రముఖ నటి ,లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.ఈషెడ్యూల్ లో హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్ ను పీటర్ హెయిన్ మాస్టర్ సూపర్ విజన్ లో షూట్ చేస్తున్నారు.ఇది 15 రోజుల పాటు కొనసాగుతుంది.150 మంది ఫైటర్లు,300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌ కానుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో యాక్టన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సోహైల్ ఖాన్,శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో,అశోక్ క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మిస్తుండగా జనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.వచ్చే ఏడాది ప్రథమార్థం లో రిలీజ్ కానుంది.

ఇక కళ్యాణ్ రామ్ నిర్మాతగా ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు.అందులో దేవర ఒకటి.యువసుధ ఆర్ట్స్ తోకలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈనెల 27న విడుదలకానుంది.అలాగే ఎన్టీఆర్ నీల్ సినిమాకి కూడా కళ్యాణ్ రామ్ ఓ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.మైత్రితో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.