బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ టైటిల్ పాత్రలో నటించిన ‘జవాన్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
షారూఖ్ ఖాన్ హోమ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్‌పై ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మించగా.. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ సహా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. టోటల్ రన్ లో ఈ సినిమా రూ.1,100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
తద్వారా షారుఖ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది జవాన్. అంతకుముందు తొలిసారిగా అదే ఏడాది జనవరిలో వచ్చిన ‘పఠాన్’ చిత్రంతో వెయ్యి కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు బాద్ షా. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అక్కడ కూడా కొన్ని వారాలపాటు నం.1లో ట్రెండింగ్ అయింది జవాన్.
ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. జవాన్ మూవీ త్వరలో జపాన్‌లో విడుదల కాబోతోంది. నవంబర్ 29న ఈ బ్లాక్ బస్టర్ జపాన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు షారుఖ్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా దీనిని గురించి అధికారికంగా వెల్లడించాడు.
ఇక ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయిన జవాన్ చిత్రం మరికొన్ని రోజుల్లో జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే అక్కడ మన ఇండియన్ స్టార్లకు మంచి ఫాలోయింగ్ ఉన్నందున ఈ సినిమా మంచి విజయం సాధించవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: