మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొలాబరేషన్‌లో తొలిసారిగా వస్తోన్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్‌కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా విశ్వం సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘మొరాకో మగువా’ అంటూ సాగే ఈ ఎలక్ట్రిఫైయింగ్, గ్రూవీ నంబర్ లైవ్లీ టెంపో, షిఫ్టింగ్ రిధమ్స్ తో అదిరిపోయింది. చేతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ డైనమిక్ సాంగ్‍కు పృధ్వీ చంద్ర, సాహితీ చాగంటి ఎనర్జిట్ వోకల్స్ అందించారు. రాకేందు మౌళి లిరిక్స్ తెలుగు, ఇంగ్లీష్‌ని అద్భుతంగా బ్లెండ్ చేసింది.
గోపీచంద్, కావ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీ, ఎలిగెన్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘మొరాకో మగువా’ సాంగ్ మ్యూజిక్ ప్రమోషన్‌లకు చార్ట్ బస్టర్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ మన్నె వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రీను వైట్ల కెరీర్‌లోని ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో భాగస్వామ్యం ఉన్న స్క్రీన్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఇక ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికితోడు ఈ చిత్రంలో గోపీచంద్ తన స్టైల్ ఆఫ్ మాసీ లుక్‌లో కనిపించనుండటం ఆసక్తిగా అనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న శ్రీను వైట్ల, గోపీచంద్ ఇద్దరికి విశ్వం సినిమాతో అయినా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. కాగా దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: