బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను

Director Anil Ravipudi Superb Words About Hasya Brahma Brahmanandam

ఈ సినిమాలో బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యానని తెలిపారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఆయన దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ మూవీస్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఉత్సవం టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రసంగించారు. అనిల్ రావిపూడి ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. “ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది. నాటకరంగం, రంగస్థలం బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. నాటకం గురించి ఈ జనరేషన్ కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. నాటకం నుంచి చాలా గొప్ప నటులు సినిమా రంగాన్ని ఏలారు. నాటకం అమ్మ వంటిది. సినిమా ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్న బిడ్డలాంటింది.”

“ఈ సోషల్ మీడియా జనరేషన్ లో నాటకాలు ఇంకా ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. నాటక ప్రదర్శనలు ఇంకా జరుగుతున్నాయి. నేను, రఘుబాబు అన్నయ్య చాలా నాటకపోటీలకు విశిష్ట అతిధులుగా వెళ్లి టీమ్స్ కి బ్లెస్ చేసి, బహుమతులు ఇస్తుంటాం. నాటకరంగం నుంచి ఇప్పటికీ చాలా మంది నటులు సినిమాలకి వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలా మందికి వేషాలు ఇచ్చాను. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకొని ‘ఉత్సవం’ సినిమాని చాలా కష్టపడి చేశారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి. దర్శక నిర్మాతలకు నా స్పెషల్ విషెస్.”

“దిలీప్ కి ఇది ఫస్ట్ ఫిల్మ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రెజీనా కసాండ్రా మంచి రోల్స్ చేస్తుంటారు. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అనూప్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన్ని ఇంకా మంచి మంచి పాత్రల్లో మనం ఉపయోగించుకోవాలి. రాజేంద్రప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటుడు. ఉత్సవం పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. ఇందులో వుండే దాదాపు అందరి నటులతో వర్క్ చేశాను. టీంలో అందరికీ నా బెస్ట్ విషెస్” అని తెలిపారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.