టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఆనంద సమయంలో నందమూరి అభిమానులకు మరో శుభవార్త అందింది. బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు కలిగించే అప్‌డేట్ వచ్చింది. బాలకృష్ణ తనయుడు నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ గ్రాండ్‌గా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’ ఫేమ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు నేడు మోక్షజ్ఞ జన్మదినం సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
కాగా ‘హనుమాన్’ సినిమాతో ఓవర్ నైట్‌లో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించబడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది.
దీంతో ప్రశాంత్ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ విజయంతో దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రశాంత్ పూనుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఒకవైపు ఇది కొనసాగుతుండగానే మరోవైపు ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞతో సినిమా చేయనుండటం విశేషం. దీని గురించి ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టి మరీ తెలియజేశాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కూడా పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగానే రూపొందనుండటం గమనార్హం. మరో విశేషమేమంటే.. ఇందులో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక పీవీసీయూతో మోక్షజ్ఞ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుండటంతో, ఇంకా మొదలుకాకముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: