సుహాస్ గొర్రె పురాణం రిలీజ్ డేట్ ఫిక్స్
Suhas’ Gorre Puranam Release Date Locked

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన గత చిత్రాలు 'అంబాబీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న గొర్రె పురాణం సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.
టైటిల్ తోనే ఈ చిత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అనంతరం సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పాటలు సహా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గొర్రె పురాణం సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచుతున్నారు. దీనిలో భాగంగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ అందించారు మేకర్స్. గొర్రె పురాణం సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నట్టు తెలిపారు. ఈనెల 20వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఇదిలావుంటే, మరోవైపు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన జనక అయితే గనక సినిమా కూడా త్వరలోనే గ్రాండ్‌గా విడుదల కానుంది.







