తెలుగు రాష్ట్రాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అధినేత దిల్ రాజు సోషల్ మీడియాలో దీనిపై ఓ ప్రకటన చేశారు.
అందులో.. “ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో వరదలు వినాశనాన్ని మిగిల్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తరపున మేము రెండు రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్స్‌కి ఒక్కొక్కరికి ₹25 లక్షలు అందజేస్తున్నాము. ఈ రాష్ట్రాలు మనకు అందించిన ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతగా కలిసి నిలబడదాం. ఇట్లు.. రాజు – శిరీష్” అని పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: