నటీనటులు: దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటింగ్: వెంకట్ రాజన్
నిర్మాణం: ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్
నిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్.సురేష్
దర్శకత్వం: వెంకట్ ప్రభు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు వెర్షన్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్‌గా అందిస్తోంది. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే ది గోట్ తో విజయ్ హిట్ అందుకున్నాడా? డ్యూయెల్ రోల్ తో ఆడియెన్స్ ను అలరించాడా? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ:
కథానాయకుడైన గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ టీమ్‌లో కీలక వ్యక్తి. అయితే, తన జాబ్ గురించి భార్య అను (స్నేహా)కు తెలియకుండా ఉంచుతాడు. వృత్తి నిర్వహణలో భాగంగా ఓ మిషన్ కోసం ఫ్యామిలీతో కలిసి థాయ్ లాండ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన కొడుకు జీవన్ (విజయ్ – డ్యూయెల్ రోల్)ను కోల్పోతాడు. తన తప్పిదం కారణంగానే తనయుడు మరణించాడనే గిల్టీ ఫీలింగ్ తో తనకు తాను శిక్ష విధించుకుంటాడు. స్క్వాడ్ వదిలి బయటకు వస్తాడు గాంధీ.
అయితే అనూహ్యంగా పదిహేనేళ్ల తర్వాత రష్యా లోని మాస్కోలో గాంధీకి కొడుకు జీవన్ కనిపిస్తాడు.వెంటనే అతడికి గతం గురించి చెప్పి ఒప్పించి ఇండియాకు తీసుకొస్తాడు. మళ్ళీ ఫామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. ఈ క్రమంలో గాంధీ కళ్ల ముందు అతని బాస్ నజీర్ (జయరామ్)ని ఎవరో చంపేస్తారు. దీని తర్వాత గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరుగా హత్య చేయబడుతుంటారు. ఈ హత్యలన్నింటి వెనుక ఉన్నది ఎవరు? మీనన్ (మోహన్) ఎవరు? తండ్రి గాంధీకి, కొడుకు జీవన్ కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరికిందా? చివరకు ఏమైంది? అన్నదే మిగతా సినిమా.
విశ్లేషణ:
ది గోట్ సినిమాను కథగా చూసుకుంటే, ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. హీరో దేశ రక్షణకు సంబంధించిన విధుల్లో పనిచేస్తుండటం, తన ఫ్రెండ్స్ సాయంతో విలన్లను ఎదుర్కోవడం అనేవి.. మనం ఇంతకుముందు అనేక చిత్రాల్లో చూసాం. అలాగే హీరో కొడుకుని విలన్ తీసుకెళ్లి పెంచి పెద్ద చేయడం, తిరిగి హీరో పైనే పగ తీర్చుకునేలా చేయడం వంటి కథతో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.
ఈ మూవీ కథ కూడా ఈ పాయింట్ తోనే తెరకెక్కింది. అయితే కొడుకు తండ్రి మీద పాగా తీర్చుకోవడానికి వచ్చిన తర్వాత జరిగే కథ, సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి ఇందులో. ఫస్టాఫ్ మొత్తం రొటీన్ తమిళ సన్నివేశాలతోనే సినిమా సాగింది. ప్రీ ఇంటర్వెల్ వరకు అలా అలా సాగిపోతున్న కథ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. కొడుకే విలన్ అని రివీల్ చేసే ట్విస్ట్ అదిరిపోతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తీసిన విధానం, మెట్రోలో ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి.
దీంతో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక్కడినుంచీ ముఖ్యంగా తండ్రి, కొడుకుల మధ్య ఒకరకంగా గేమ్ నడుస్తుందనే చెప్పొచ్చు. ఒకరికొకరు ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూ అప్పర్ హ్యాండ్ సాధించడానికి ట్రై చేస్తుంటారు. ఈ సెన్స్ ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. అలాగే ట్విస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఫస్టాఫ్ కంటే.. సెకండాఫ్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ విజయ్ హీరోయిజాన్ని బాగా హైలైట్ చేసాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. తమిళనాట ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో ‘ది గోట్’ మీద అంతటా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో ఆయన పోషించిన డ్యూయెల్ రోల్స్ అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా ఆయన విలనిజం ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ఇందులో విజయ్ డైలాగులు, హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యాయి. ఆయన నుంచి అభిమానులు ఆశించే మాస్ మేనరిజమ్స్, పంచ్ డైలాగ్స్ విజిల్స్ వేయిస్తాయి..
వెంకట్ ప్రభు రచన, దర్శకత్వంలో ఫాదర్ వర్సెస్ విలన్ కాన్సెప్ట్ తప్ప సినిమా అంతా పాత తమిళ వాసనలు కొట్టింది. దానికి తోడు నిడివి ఎక్కువ కావడం మరో మైనస్. క్లుప్తంగా ముగించాల్సిన సన్నివేశాలను సైతం సాగదీసి సాగదీసి చెప్పారు. ఒక్క పాటకు సరైన ప్లేస్‌మెంట్ లేదు సరికదా… ఒక్క పాట కూడా మళ్లీ వినాలని అనిపించేలా లేదు. పాటలు, నేపథ్య సంగీతంలో యువన్ శంకర్ రాజా నిరాశ పరిచారు. కెమెరా వర్క్ ఓకే. డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసిన యంగ్ విజయ్ లుక్ ట్రోల్ చేసేంత విధంగా లేదు. సినిమాలో పర్వాలేదు.
స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్‌లో విజయ్ కొలీగ్స్ గా ప్రభుదేవా, ‘జీన్స్’ ప్రశాంత్, అజ్మల్ అమీర్ అలరించారు. ఈ టీమ్ బాస్ పాత్రలో కనిపించిన జయరామ్ బాగా నటించారు. చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్ స్నేహకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. ఆ పాత్రలో ఆమె నటన చాలా బావుంది. మీనాక్షి చౌదరి పాత్రకు సినిమాలో ఎక్కువ టైమ్ స్పేస్ లేదు. ఒకటి, రెండు సన్నివేశాలు, ఒక పాటలో కనిపించింది. ఉన్నంతవరకూ పర్వాలేదనిపించేలా చేసింది.
ఇక మరో స్టార్ హీరోయిన్ త్రిష ఓ పాటలో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. ఈ పాటలో విజయ్, త్రిషల జంట మధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉంది. ఈ సాంగ్ పిక్చరైజేషన్ పరంగా అద్భుతంగా ఉంది. ఇక తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఓ చిన్న పాత్రలో కనిపించి సందడి చేశారు. ఎంఎస్ ధోని ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజ్ సందర్భోచితంగా వాడారు. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా దివంగత నటుడు, కెప్టెన్ విజయకాంత్‌ను చూపించడం బావుంది.
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. దర్శకుడిగా వెంకట్ ప్రభు కథ, స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశారు. సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా తన స్థాయి ఏంటో చూపించారు. సిద్ధార్థ నుని అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్ గా ప్రజెంట్ చేసింది. ఇక వెంకట్ రాజన్ ఎడిటింగ్ వర్క్ కి మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుకి నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని తెలుస్తుంది.
హీరోలు ఎప్పుడూ మంచివారిగా కనిపించడం సాధారణ విషయమే. అప్పుడప్పుడూ వారిలో విలనిజం చూస్తే కిక్ ఉంటుంది. అందుకు ‘ది గోట్’ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. మొత్తానికి ‘ది గోట్’ విజయ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరినీ అలరించేలా ఉంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్, విజయ్ విలనిజం హైలైట్స్ అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: