మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్ కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల కెరీర్‌లోని ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో భాగస్వామ్యం ఉన్న స్క్రీన్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో గోపీచంద్ మాసీ లుక్‌లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వం ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ శ్రీను వైట్ల తరహా కామెడీతో సాగింది. అలాగే గోపీచంద్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది.
టీజర్ నరేష్ విజయకృష్ణ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైయింది. గోపీచంద్, కావ్యా థాపర్ పాత్రల పరిచయం, వారి క్యారెక్టర్స్ లో కామెడీ స్పార్క్ ఆకట్టుకున్నాయి. టీజర్ లో ప్రముఖ నటీనటులతో కామెడిక్ సీన్స్ హిలేరియస్ గా వున్నాయి, టీజర్ చివరి భాగంలో యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. గోపీచంద్ అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు. తన ఇంటెన్సిటీతో కామెడీని బ్లెండ్ చేసే పాత్రలో మెరిశారు.
డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో ఆయన దిట్ట. దీనికి తగ్గట్టే ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్‌ని ఎఫెక్టివ్‌గా బ్యాలెన్స్ చేస్తూ హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ ని ప్రజెంట్ చేశారు శ్రీను వైట్ల. డైలాగ్‌లు, కామెడీ, యాక్షన్ బ్లెండ్ మంచి కమర్షియల్ ఔటింగ్ ని ప్రామిస్ చేస్తున్నాయి.
కావ్య థాపర్ తన గ్లామర్‌తో ఆకట్టుకోగా, నరేష్, వెన్నెల కిషోర్, మిగతా నటులు వినోదాన్ని అందించారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి.
మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న వీరిద్దరికి విశ్వం సినిమాతో అయినా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఇక టీజర్‌తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: