ప్రభాస్ తో సినిమా చేయాలని వుంది – ఫరియా అబ్దుల్లా

I want to do a film with Prabhas in a bigger role says Faria Abdullah

జాతి రత్నాలు తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టింది ఫరియా అబ్దుల్లా.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మత్తు వదలరా2 తో అలరించడానికి సిద్ధమౌతోంది.శ్రీ సింహ కోడూరి ,సత్య లీడ్ రోల్స్ లో మత్తు వదలరా కు సీక్వెల్ గా వస్తుంది.రితేష్ రానా డైరెక్ట్ చేశాడు.సెప్టెంబర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మత్తు వదలరా 2’ ఆఫర్ ఎలా వచ్చింది ?

ఈసినిమా ఒక థ్రిల్లర్.యాక్టర్స్ ట్రాజీడీ నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. కథ చాలా నచ్చింది.విన్న వెంటనే ఇమ్మిడియట్ గా ఓకే చేసేశా.మత్తు వదలరా పార్ట్ 1 బిగ్ హిట్.సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కి డిఫరెంట్ గా వుంటుంది.శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ డెలివరీ బాయ్స్ నుంచి స్పెషల్ గా ఏజెంట్ గా కనిపిస్తారు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?

ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నిధి.తను కూడా ఒక స్పెషల్ ఏజెంట్. శ్రీసింహ, సత్య క్యారెక్టర్స్ పై సాఫ్ట్ కార్నర్ వుంటుంది.ఇందులో నా క్యారెక్టర్ కు యాక్షన్ వుంటుంది. మాచో రోల్.అది నాకు చాలా నచ్చింది.గన్స్ తో యాక్షన్ ప్లే చేయడం చాలా ఎంజాయ్ చేశా.

ఈ సినిమాలో సాంగ్ పాడినట్లు వున్నారు ?

ఈ సినిమాలో లిరిక్స్ రాయడంతో పాటు సాంగ్ పాడాను.డైరెక్టర్ రితేష్ కి ఈ ఆలోచన చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది.అలాగే నా టీంతో సాంగ్ కొరియోగ్రఫీకూడా చేశాను.

శ్రీసింహ, సత్యలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కదా.. ఆ కాంబోని మీరు ఎలా మ్యాచ్ చేశారు?

నేను అందరితో కలసిపోతాను.వాళ్ళ హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కి నా క్యారెక్టర్ బ్యాలెన్స్ చేస్తుంది.ఇందులో నా క్యారెక్టర్ కాస్త స్మార్ట్ గా వుంటుంది.

డైరెక్టర్ రితేష్ రానా గురించి ?

రితేష్ రానా చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు.ఆయన అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే సాంగ్ కొలాబరేషన్ సాధ్యపడింది. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.

కల్కిలో రోల్ చేయడం ఎలా అనిపించింది?

చాలా ఎక్సయిటింగ్ ఎక్స్ పీరియన్స్ అది.డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి థాంక్ యూ. ప్రభాస్ గారితో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని కోరుకుంటున్నాను.

శ్రీసింహ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

శ్రీసింహ వెరీ ట్యాలెంటెడ్, స్వీట్.చాలా హార్డ్ వర్కింగ్ చేస్తారు.ఆయనతో మళ్ళీ కలసి పని చేయాలని వుంది.

సునీల్, వెన్నెల కిషోర్ పాత్రల గురించి ?

వెన్నెల కిషోర్ గారితో జాతిరత్నాల నుంచి పరిచయం వుంది.సునీల్ గారు జెమ్.వారి పాత్రలు ప్రేక్షకులని చాలా ఎంటర్ టైన్ చేస్తాయి.

నిర్మాతల గురించి?

చాలా సపోర్ట్ చేశారు.చాలా కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు.వారితో పని చేయడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్.నాకు చిన్నప్పటి నుంచి రైటింగ్ పై ఆసక్తి వుంది.ఈ సినిమాలో పాట రాసిన అవకాశం కూడా ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మత్తు వదలరాకి, ఈపార్ట్ 2కి ఎలాంటి పోలికలు వుంటాయి?

మత్తు వదలరా ఫ్యాన్ బేస్ ఇందులో వుండే కంటెంట్ ని చాలా ఎంజాయ్ చేశారు.అలాగే స్టాండ్ లోన్ సినిమాగా కూడా ఈ మూవీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది.

నెక్స్ట్ సినిమాల గురించి ?

తిరువీర్ తో ఓ లవ్ స్టొరీ చేస్తున్నాను.ఒక తమిళ్ మూవీ స్టార్ట్ కాబోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.