సరిపోదా శనివారం చాలా ఆనందాన్ని ఇచ్చింది : జేక్స్‌ బెజాయ్‌

Jakes Bejoy talks about Saripoda Sanivaaram

నాచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా సరిపోదా శనివారం బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.ఈసినిమా విజయంలో మ్యూజిక్ఈ కూడా కీ రోల్ ప్లే చేసింది. ఈ సందర్భంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్‌ బెజాయ్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సరిపోదా శనివారం మ్యూజిక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది .. ఎలా అనిపిస్తోంది ?

మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ఇప్పటివరకూ అరవైకి పైగా సినిమాలు చేశాను.ఏ సినిమాకి రానంత ప్రేమ, రెస్పాన్స్ ఇప్పుడు ఈ సినిమాతో వచ్చింది. కంటిన్యూగా మెసేజులు వస్తున్నానే వున్నాయి. అద్భుతంగా వుందని చెబుతున్నారు.ప్రేక్షకులని ఎంటర్ టైనర్ చేస్తే ఎంత లవ్ ఇస్తారో ఈ సినిమాతో చూశాను. ఈ సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.

సరిపోదా శనివారం చేయడానికి కారణం ఏంటి ?

దుల్కర్ తో చేసిన కింగ్ ఆఫ్ కొత్త తర్వాత ఈ సినిమా కథ విన్నాను. నాని గారికి, డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి ఆ సినిమా ట్రాక్స్ నచ్చాయి.వివేక్ సరిపోదా శనివారం కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఎక్సైటింగ్ గా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ కమర్శియల్ లైన్ ఇది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ ఆర్క్ వండర్ఫుల్ గా ఉంది.కథ విన్నప్పుడే అరిదిపోయిందనిపించింది. వివేక్ కన్విక్షన్ నన్ను ఎక్సయిట్ చేసింది.

హీరో కి ఈక్వెల్ గా విలన్ కి ట్రాక్ కి మ్యూజిక్ చేయడం గురించి?

ఈ కథ విన్నప్పుడే దయా క్యారెక్టర్ నన్ను ఎక్సయిట్ చేసింది.తన క్యారెక్టర్ ఆర్క్ అదిరిపోయింది.సూర్య గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.క్యారెక్టర్ ఆర్క్ ని బట్టి మ్యూజిక్ అంత మ్యాగ్నటిక్ గా వచ్చింది.ఇంటర్వెల్ బ్యాంగ్ లో డైలాగ్స్ వుండవు. బీజీఎంలోనే హై మూమెంట్ వుంటుంది.క్లాక్ బాయ్ మూమెంట్ లో ఆడియన్స్ మ్యూజిక్ లో హైని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

బీజీఎంకు ఎక్కువ ప్రసంశలు రావడం ఎలా అనిపించింది ?

చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా రైటింగ్ చాలా స్ట్రాంగ్ వుంది. నాని గారు, సూర్య గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, విలన్ బ్రదర్స్ సెంటిమెంట్.. ఇవన్నీ చక్కగా బ్లెండ్ అయ్యాయి. దీంతో ఆడియన్స్ మ్యూజిక్ లో హై కనెక్ట్ అయ్యారు.డైరెక్టర్ వివేక్ జీనియస్. ఈ మధ్యకాలంలో నేను పని చేసిన బెస్ట్ కమర్షియల్ సినిమా ఇది.

వివేక్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

తను హాఫ్ మ్యూజిక్ డైరెక్టర్.(నవ్వుతూ) వివేక్ చాలా మ్యూజికల్. తను మ్యూజిక్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తనకి మ్యూజిక్ ప్రోగ్రామింగ్ విషయంలో క్లియర్ విజన్ వుంటుంది.తన సినిమాకి ఎలాంటి సౌండ్ కావాలో క్లారిటీ వున్న దర్శకుడు నాకు చాలా హెల్ప్ ఫుల్ గా వున్నారు.తను లిరిక్స్ విషయంలో చాలా పర్టిక్యులర్.ఎక్కడా రాజీపడరు.

ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి అందుకున్న కాంప్లిమెంట్ ?

డైరెక్టర్ మారుతి గారు కాల్ చేసి’మ్యూజిక్ ఆదరగొట్టావ్’ అన్నారు.ఆయనకి సినిమా చాలా నచ్చింది.మ్యూజిక్, రైటింగ్ ని చాలా మెచ్చుకున్నారు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ?
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ హౌస్. దానయ్య గారు చాలా సపోర్ట్ చేశారు.

ఈ మధ్య కాలంలో క్యాచి సాంగ్స్, వైరల్ సాంగ్స్ ఇవ్వడంపైనే అందరూ ఫోకస్ చేస్తున్నారు కదా?

ఇన్స్టా గ్రామ్ ఎరాలో వున్నాం. క్యాచి కంటెంట్ ఇచ్చి ఎట్రాక్ట్ చేయాల్సిందే.ఆడియన్స్ అభిరుచికి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలి. అలాగని మన మ్యూజిక్ లో సోల్ మిస్ కాకూడదు. సోల్ వున్న మ్యూజిక్ చాలా కాలంలో నిలుస్తుంది.

మ్యూజిక్ పరంగా తెలుగు, మలయాళంకు ఎలాంటి తేడా వుంది ?

మ్యూజిక్ విషయంలో అన్ని భాషల్లో ఒకటే అప్రోచ్ వుంటుంది.కంటెంట్ ని బట్టే మ్యూజిక్ వుంటుంది.

‘సరిపోదా శనివారం’ సక్సెస్ తర్వాత తెలుగు నుంచి ఆఫర్లు వస్తున్నాయా ?

-చాలా కాల్స్ వచ్చాయి. మీటింగ్స్ వున్నాయి.నా కమిట్మెంట్స్ ని బట్టి ఫిల్టర్ చేసుకోవాలి.

తెలుగులో ఈ మధ్య కాలంలో నచ్చిన ఆల్బమ్స్ ?

-కల్కి చాలా నచ్చింది.మిక్కీ జే మేయర్,తమన్ తో పాటు చాలా కంపోజిషన్స్ వింటాను.

తెలుగులో చేస్తున్న సినిమాలు ?

ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ చేస్తున్నాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.