కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

శ్రీ విష్ణు స్వాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Sree Vishnu’s Swag Release Date Announced

శ్రీ విష్ణు స్వాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Swag Release Date Announced

Sree Vishnu’s Swag Release Date Announced

కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్'తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా, మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అప్‌డేట్‌తో వచ్చారు. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న 'స్వాగ్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. పండుగ సెలవులు సినిమాకు ఫేవర్‌గా ఉండబోతున్నాయి. సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల సమయం ఉంది. రెగ్యులర్ అప్‌డేట్‌లతో రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్వాగ్ పాజిటివ్ రిపోర్ట్స్‌తో దూసుకుపోతోంది.

పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ కంటెంట్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్