తెలుగు రాష్ట్రాలను వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా అక్కినేని కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. అందులో.. “శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుంటారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం” అని ప్రకటించింది.
“ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాము. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం” అని తెలిపింది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: