మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ క్రేజీ కాంబో నుంచి ఈద్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో ఆడియెన్స్ కి మాస్ ఫీస్ట్‌ని అందించింది. గోపీచంద్ 32వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తుండగా.. రీసెంట్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల కెరీర్‌లోని ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌లో భాగస్వామ్యం ఉన్న స్క్రీన్ రైటర్ గోపీ మోహన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా.. నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విశ్వం ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. “విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా అయ్యేది కాదు. శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. వన్ ఇయర్ బ్యాక్ ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ వున్న డైరెక్టర్. ఈ జర్నీ చాల ఎంజాయ్ చేశాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమా చాలా బాగా వచ్చింది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను. శ్రీను వైట్ల గారు అందులో మాస్టర్. ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తూనే వుంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది” అని అన్నారు హీరో గోపీచంద్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: