నాని సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.03కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడనుంది.హైదరాబాద్ లో మాత్రం బుకింగ్స్ మొదటి రోజుకు ఏమాత్రం తగ్గకుండా వున్నాయి.రేపటితో ఈసినిమా 50కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇక ఇప్పటివరకు ఈసినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 40శాతం రికవరీ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లో సరిపోదా శనివారం అదరగొడుతుంది.నిన్నటితో నార్త్ అమెరికాలో 1.1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.నానికి ఇది 10వ మిలియన్ డాలర్ మూవీ.టాలీవుడ్ లో అత్యధిక మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోల జాబితాలో మహేష్ బాబు 12 సినిమాలతో మొదటి స్థానంలో ఉండగా నాని రెండవ స్థానం లో కొనసాగుతున్నాడు.ఫుల్ రన్ లో సరిపోదా శనివారం 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో అదరగొట్టాడు.జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.డివివి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































