నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సహా ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఇటీవల చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది. ఈ వేడుకలో ప్రత్యేక అతిథులుగా ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ, దేవ కట్టా, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ.. నటుడు శ్రీకాంత్, నిర్మాత సుధాకర్ చెరుకూరి సహా పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ.. “ఈ సినిమా గ్లింప్స్ నుంచి చాలా ఆసక్తిగా అనిపించింది. కాన్సెప్ట్ చాలా బాగుంది. నాని, నేను సినిమా అంటే పిచ్చి. సినిమానే ప్రేమిస్తాం. మేం ఎక్కడ కలిసినా సినిమాల గురించే మాట్లాడుకుంటాం. నానికి సినిమా అంటే ట్రెజర్ హంటర్ లాంటిది. సినిమా అనేది ఒక్కో శైలిలో వుండేలా చూసుకుంటాడు. 30వ సినిమా దసరా చేశాడు. 31వ సినిమా కూడా కొత్త దర్శకుడితో చేశాడు” అని గుర్తుచేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇది 32వ సినిమా. ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథ వింటాడు. అందుకే ఇండస్ట్రీకి నాని ట్రెజర్ లాంటివాడు. ట్రెజర్ హంటర్ ఎందుకంటే.. ఇంకా కొత్త దర్శకులకోసం వెతుకుతూనే వున్నాడు. 32కాదు ఇంకా 64 సినిమాలు తీయాలి. ఇక సూర్య నటుడిగా, దర్శకుడిగా అభిమానిని. ప్రియాంక మరలా తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా వుంది. దానయ్య గారికి మంచి సినిమా అవ్వాలి అని ఆకాంక్షించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: