ఆ సినిమాలో చెత్తగా నటించా- అమీర్ ఖాన్ 

my performance let Laal Singh Chaddha down says aamir khan

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక రేస్ లో చాలా వెనకబడాడ్డు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.ఈ హీరో చివరగా లాల్ సింగ్ చద్దాతో వచ్చాడు. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది.ఇందులో నాగ చైతన్య కూడా ఓ పాత్రలో కనిపించాడు.ఈసినిమా కోసం చాలానే శ్రమించాడు అమీర్.కానీ తను అనుకున్న విజయం మాత్రం దక్కలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి అమీర్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు.లాల్ సింగ్ చద్దాలో తన నటన చెత్తగా ఉందని చాలా మందికి తన నటన నచ్చేలేదని అందుకే సినిమా ఫెయిల్ అయిందని ఓపెన్ గా చెప్పేశాడు.అయితే సితారే జమీన్ పర్ మాత్రం అద్భుతంగా ఉంటుందని ఈసినిమా చేస్తునందుకు చాలా సంతోషంగా ఉందని అమీర్ ఖాన్ వెల్లడించాడు.

అమీర్ ఖాన్ నుండి వస్తున్న తదుపరి సినిమా సితారే జమీన్ పర్.ఆర్ ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో అమీర్ తోపాటు జెనీలియా దేశముఖ్ ,దర్షీల్ కీలక పాత్రాల్లో నటిస్తున్నారు.2018లో వచ్చిన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా డిసెంబర్ 25న విడుదలకానుంది.మరి ఈసినిమాతో అమీర్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

ఇక ఇదిలావుంటే అమీర్ ఖాన్,సౌత్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయాలనే యోచనలో ఉన్నట్లు టాక్.రీసెంట్ గా షారుక్ ,అట్లీ తో జవాన్ చేసి బ్లాక్ బాస్టర్ కొట్టగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్,మురగదాస్ తో సికందర్ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని చూస్తున్నాడట. త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.