ఐఫా ఉత్సవం అవార్డ్స్.. కోలీవుడ్ నామినేషన్స్‌లో స్టార్ హీరో, హీరోయిన్స్

IIFA Utsavam Awards 2024 Nominations From Kollywood

ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక ‘ఐఫా ఉత్సవం’ (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్‌కి అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో గల ప్రతిష్టాత్మక ఎతిహాద్ ఎరీనా ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా.. సెప్టెంబర్ 27వ (శుక్రవారం) తేదీన గ్రాండ్ గా జరుగనుంది. అందులో భాగంగా తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలకు సంబంధించి అవార్డులు ప్రకటించనున్నారు. విజేతలకు ప్రముఖుల చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఇక ఈ సంరంభం కోసం దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల నుండి అగ్ర తారలు, ఫిల్మ్ మేకర్స్ విచ్చేయనున్నారు. కాగా 2024 ఐఫా అవార్డుల కోసం నామినేషన్స్ ఓపెన్ అయ్యాయి. దీనిలో భాగంగా సౌత్ లోని అన్ని భాషల నుంచి ఈ నామినేషన్స్ పూర్తయ్యాయి. కోలీవుడ్ నుంచి కొన్ని చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఐఫా ఉత్సవం.. కోలీవుడ్ నామినేషన్స్‌ వివరాలు

ఉత్తమ చిత్రం

  • మామన్నన్
  • అయోతి
  • పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2
  • విదుతలై పార్ట్ 1

ఉత్తమ దర్శకుడు

  • వెట్రిమారన్ – విడుతలై పార్ట్ 1
  • ఆర్ మంతిర మూర్తి – అయోతి
  • కార్తీక్ సుబ్బరాజ్- జిగర్తాండ డబుల్ ఎక్స్
  • నెల్సన్ దిలీప్ కుమార్ – జైలర్
  • లోకేష్ కనగరాజ్ – లియో
  • మణిరత్నం – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2

ఉత్తమ నటుడు

  • విక్రమ్ – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2
  • రజనీకాంత్ – జైలర్
  • సూరి – విడుతలై పార్ట్ 1
  • శివ కార్తికేయన్ – మావీరన్
  • కార్తీ -పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2
  • సిద్ధార్థ్ – చిత్తా

ఉత్తమ నటి

  • ఐశ్వర్య రాయ్ బచ్చన్ – పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2
  • త్రిష కృష్ణన్ – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2
  • నయనతార – అన్నపూర్ణి
  • ఐశ్వర్య రాజేష్ – ఫర్హానా
  • శ్రద్ధా శ్రీనాథ్ – ఇరుగపట్రు
  • కీర్తి సురేష్ – మామన్నన్

ఉత్తమ విలన్

  • SJ సూర్య – మార్క్ ఆంటోని
  • ఫహద్ ఫాసిల్ – మామన్నన్
  • వినాయకన్ – జైలర్
  • సెల్వరాఘవన్ – ఫర్హానా
  • అర్జున్ సర్జా – లియో

ఉత్తమ సహాయ నటుడు

  • ఆర్. శరత్ కుమార్ – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2
  • గౌతమ్ వాసుదేవ్ మీనన్ – విడుతలై పార్ట్ 1
  • అళగం పెరుమాళ్- మామన్నన్
  • జయరామ్ – పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2
  • రెడిన్ కింగ్స్లీ – మార్క్ ఆంటోనీ

ఉత్తమ సహాయ నటి

  • రైచల్ రాబెక్కా – గుడ్ నైట్
  • రమ్య కృష్ణన్ – జైలర్
  • ఐశ్వర్య లక్ష్మి – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2
  • సహస్ర శ్రీ – చిత్తా
  • సరిత – మావీరన్

ఉత్తమ సంగీతం

  • జివి ప్రకాష్ కుమార్ – అనేతి
  • అనిరుధ్ రవిచందర్ – జైలర్
  • ఇళయరాజా – విడుతలై పార్ట్ 1
  • ధిబు నినన్ థామస్ & సంతోష్ నారాయణన్ – చిత్తా
  • AR రెహమాన్ – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2

ఉత్తమ నేపథ్య గాయకుడు

  • సీన్ రోల్డాన్ – (నాన్ గాలి – గుడ్ నైట్)
  • అనిరుధ్ రవిచందర్ (హుకుమ్ – జైలర్)
  • విజయ్ యేసుదాస్ – (నెంజమే నెంజమే – మామన్నన్)
  • అనిరుధ్ రవిచందర్ – (బాడ్ యాస్ – లియో)
  • విశాల్ మిశ్రా – (రథమారే – జైలర్)
  • హరిహరన్ – (చిన్నంజీరు నిలవె – పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2)

ఉత్తమ నేపథ్య గాయని

  • శక్తి శ్రీ గోపాలన్ – (ఆగ నాగ – పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2)
  • శ్వేతా మోహన్ – (వావతి – వాత్తి)
  • అనన్య భట్ – (కట్టుమల్లి – విడుతలై పార్ట్ 1)
  • శక్తిశ్రీ గోపాలన్ – (నెంజమే నెంజమే – మామన్నన్)
  • శిల్పా రావు – (కావాలయ్యా – జైలర్)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.