ప్రతి వారం థియేటర్ వద్ద పలు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతుంటాయి. ఇక పండుగలు, స్పెషల్ డేస్ వచ్చాయంటే సినీ లవర్స్ కు మరింత పండుగ లాంటిది. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులోనూ ఆగష్ట్ 15 ఇండిపెండెన్స్ డే కావడంతో అరడజను పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన కంటెంట్ కు మంచి బజ్ వచ్చింది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్
ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. స్టైలిష్ డైరెక్షన్,ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైయింది. ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తంగలాన్
తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు.
ఆయ్
అంజి కే దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఆయ్. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా ఈసినిమా వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈసినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈసినిమాకు రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: