నరేష్ విజయకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో మెరిసిన సెలబ్రిటీలు

Naresh Vijayakrishna Golden Jubilee Celebrations, Many Celebs Attend

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా తాజాగా ఆయన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, స్నేహితులు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వేడుకల సందర్భంగా విజయకృష్ణ మందిర్ మరియు ఘట్టమనేని ఇందిరాదేవి స్పూర్తి వనాన్ని ఇనాగరేట్ చేశారు. చిత్ర పరిశ్రమకు కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా రూపొందించబడిన స్పూర్తి వనం సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల విగ్రహాలతో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీమతి సూరేపల్లి నంద గారు పాల్గొన్నారు. న్యాయమూర్తి శ్రీ ఎన్ మాధవరావు గారు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ సూరేపల్లి ప్రశాంత్ గారు హాజరయ్యారు.

భావి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ప్రజలకు ఇది తన కానుకని డాక్టర్ నరేష్ విజయకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్పూర్తి వనం యువ రచయితలు, దర్శకులు, సంగీత దర్శకుల కోసం సృజనాత్మక వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో ఫిల్మ్ లైబ్రరీ, మ్యూజియంను హోస్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇది అభిమానులకు, ప్రజలకు ఓపెన్‌గా వుంటుంది.

ఈవెనింగ్ మీట్ అండ్ గ్రీట్ రిసెప్షన్‌లో నరేష్ విజయకృష్ణ, పవిత్ర లోకేష్ & జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి పూనమ్ ధిల్లాన్, ప్రముఖ హీరో జాకీ ష్రాఫ్, సుహాసిని మణిరత్నం, కుష్బూ సహా ఇతర ప్రముఖ నటులు సత్కరించారు.

ఈ వేడుకలో హీరో సాయి దుర్గ తేజ్, హీరో మనోజ్ మంచు, నారా రోహిత్, దర్శకుడు మారుతి, దర్శకుడు అనుదీప్, సాయిరామ్ అబ్బిరాజు, యాక్టర్ అలీ, సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాతలు శరత్ మరార్, రాధ మోహన్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 26 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సాయి దుర్గ తేజ్ మరియు కలర్స్ స్వాతి నటించిన నవీన్ విజయకృష్ణ మూవీ ‘సత్య’ చిత్రాన్ని స్క్రీన్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.