కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. క్రియేటివ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ విలన్ పాత్రను పోషించగా.. ప్రముఖ కోలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ పశుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో తంగలాన్ చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ మాట్లాడుతూ – మా “తంగలాన్” మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ హోటల్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వీవీఐటీ కాలేజ్ విజిట్ చేశాం. అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాకు ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నా ‘అపరిచితుడు’ సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ ఈ సినిమాను అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసి మీ రెస్పాన్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను. నా ఫేవరేట్ డైరెక్టర్ పా రంజిత్ గారితో ఈ మూవీ చేశాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్ తో రంజిత్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త వరల్డ్ లోకి మిమ్మల్ని “తంగలాన్” సినిమా తీసుకెళ్తుంది. ఆగస్టు 15న తప్పకుండా థియేటర్స్ లో చూడండి” అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: