మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలిరోజే రూ.1.63 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తూ, ఇంతటి భారీ విజయాన్ని కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. చిత్ర యూనిట్ అందరూ హాజరైన ఈ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఇదిలావుంటే, ఈ సినిమా ఘనవిజయం సాధించడంపట్ల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా.. “కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు సంబంధించి మంచి విషయాలను విన్నాను! తొలి చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌గా సాధించిన నిహారిక కొణిదెలకు అభినందనలు. సినిమాలో సక్సెస్‌లో భాగమైన చిత్ర యూనిట్‌కు అభినందనలు. త్వరలోనే ఈ సినిమా చూడాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఇక మహేష్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో 11మంది కొత్తవారు నటించడం విశేషం. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: