బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్, తంగలాన్ లతో పోటీ పడనుంది ఆయ్.ట్రైలర్,సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండడం దానికి తోడు గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఆయ్ పై మంచి అంచనాలు వున్నాయి.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.అందులో భాగంగా రేపు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దసపల్లా లో జరుగనుంది.ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల రానుంది.రేపు సాయంత్రం 6 గంటలకు ఈఈవెంట్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.అంజి కె మణిపుత్ర డైరెక్ట్ చేసిన ఈసినిమాలో నార్నె నితిన్ హీరోగా నటించగా నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.రామ్ మిర్యాల సంగీతం అందించాడు.మరి నితిన్ కు ఈసినిమా వరసగా రెండో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
ఇక గత ఏడాది మ్యాడ్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నితిన్.ఇందులో నార్నె నితిన్ తోపాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించారు.ప్రస్తుతం ఈసినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతుంది.మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాలో మ్యాడ్ త్రయం లీడ్ రోల్స్ లో నటిస్తుండగా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: