బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయులు ఆర్యన్ ఖాన్ మరియు అబ్రమ్ ఖాన్ లతో కలిసి మొట్టమొదటిసారిగా ఒక సినిమాకు పనిచేశారు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే హాలీవుడ్ విజువల్ వండర్‌కు హిందీ వెర్షన్‌లో వీరు డబ్బింగ్ చెప్పారు. కాగా గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ప్రీక్వెల్. ఇండియాలో ఈ యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దీనిలో భాగంగా లయన్ కింగ్ సినిమా దేశవ్యాప్తంగా అత్యద్భుత కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమా అప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో రిలీజైన సమయంలో అక్కడి ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పించారు. ఇక తెలుగులో ముఫాసా పాత్రకు సాయి కుమార్ గాత్రం అందించగా.. కొడుకు సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు.
తాజాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ హింది వెర్షన్‌కు షారుఖ్ ఖాన్ తన గాత్రం దానం చేశాడు. ఈ మూవీలో అడవికి రాజైన ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా.. ముఫాసా కొడుకు సింబా పాత్రకు షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. అలాగే మూఫాసా చిన్నప్పుటి పాత్రకు షారుఖ్ చిన్న కొడుకు అబ్‌రామ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. ఇక వీరితోపాటు పుంబాకు సంజయ్ మిశ్రా, టిమోన్‌కు శ్రేయాస్ తల్పాడే గాత్రం అరువిచ్చారు.
తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేయగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఇంగ్లీష్ లో ముఫాసాకు ఆరోన్ పియర్, సింబాకు డోనాల్డ్ గ్లోవర్.. అలాగే యంగ్ ముఫాసాకు బ్రేలిన్ రాంకిన్స్ డబ్బింగ్ చెప్పారు. లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ మిళితం చేసి ఫోటోరియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజురీ యానిమేటెడ్ గా రూపొందిన ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు అకాడమీ అవార్డ్ విన్నర్ బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: