అది చూసి నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి

Committee Kurrollu Director Yadhu Vamsi Reveals Interesting Facts About Movie

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేసిన ఈ చిత్రం ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాడు దర్శకుడు యదు వంశీ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..

  • నేను ఓ ఇండీ ఫిల్మ్ తీశాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. నేను ఇంత వరకు ఎవరి దగ్గరా పని చేయలేదు. సినిమాలకు సంబంధించిన అనుభవం లేదు. కానీ ఈ కథను రాసుకుని చాలా ప్రొడక్షన్ కంపెనీలు తిరిగాను. చివరకు నిహారిక గారి వద్దకు ఈ కథ వెళ్లింది.
  • మా ఊళ్లో జరిగే జాతరను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. ఇందులో ప్రతీ ఒక్కరి కథ ఉంటుంది. ప్రతీ కుర్రాడి కథ ఇందులో కనిపిస్తుంది. ఇందులో నా పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంటుంది.
  • స్క్రీన్ మీద సినిమా ఎలా కనిపించాలనేది నిహారిక గారికి తెలుసు. దానికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. చెప్పింది చెప్పినట్టుగా తీసే ఫ్రీడం ఇచ్చారు. నిహారిక గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకేలా ఉన్నారు.
  • ఇలాంటి కథకు తెలిసిన వాళ్లు నటించి ఉంటే.. వాళ్లకంటూ సపరేట్ బ్యాగేజ్ ఉండేది. ఇందులో ప్రతీ పాత్ర కూడా హీరోలానే ఉంటుంది. అందుకే అందరూ కొత్త వాళ్లతోనే ట్రై చేశాను.
  • ప్రసాద్ ఒక్కడే కాస్త తెలిసిన వ్యక్తి. పాత్రకు తగ్గట్టుగానే ఆయన నటించాడు. కథ కోసం అందరూ వెయిట్ లాస్, గెయిన్ అయ్యారు.
  • నాకు ఈ కథ మీద చాలా నమ్మకం ఉంది. రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంలో ఇలాంటి కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను.
  • జయప్రకాష్ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్లు మాట్లాడిన కొన్ని మాటల స్పూర్తితోనే కొన్ని సీన్లను రాసుకున్నాను. ఫ్రెండ్ షిప్, పొలిటికల్ అంశాలను ఇందులో జొప్పించాను.
  • సాయి కుమార్ వంటి సీనియర్ గారితో నటించడం ఆనందంగా ఉంది. మొదటి రెండ్రోజులు కాస్త భయపడ్డాను. కానీ ఆయన ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. ప్రతీ సీన్‌లో ఆయన అనుభవం చూపించారు.
  • సెట్‌లో అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలని వర్క్ షాప్స్ ఎక్కువగా చేశాను. చిరంజీవి గారు సినిమా చూసి అందరూ అద్భుతంగా నటించారని చెప్పడం, వరుణ్ తేజ్ గారు చూసి 11 మంది ఇరగ్గొట్టేశారని చెప్పడంతో చాలా ఆనందమేసింది.
  • కేరళలో ఉన్నంత అందం కోనసీమలో ఉంది. ఆ అందాన్ని మరింత అందంగా చూపించాం. మా రాజు గారు పెట్టిన లైటింగ్, చూపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 90వ దశకంలోకి తీసుకెళ్లగలిగాం. అనుదీప్ గారి పాటలు అందరినీ మెప్పించాయి.
  • నెక్ట్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కథను రాసుకుంటున్నాను. అందరూ భయపడేలా ఈ కథ ఉంటుంది. ఈ మూవీ పెద్ద హిట్ అయితే.. నేను అనుకున్న హీరోతోనే ఆ సినిమా చేస్తాను.
  • మాలాంటి కొత్త వాళ్లతో సినిమా అంటే అందరూ బడ్జెట్ గురించి లిమిట్స్ పెడతారు. కానీ నిహారిక గారు ఎప్పుడూ బడ్జెట్ విషయాలు మా వరకు రానివ్వలేదు. సినిమాకు ఏం కావాలో అది చేశారు. ఆమె మా కంటెంట్‌ను నమ్మారు.
  • ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. అమ్మ సెంటిమెంట్‌ను ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాను.
  • మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తాం. థియేటర్లో చూడాల్సిన సినిమా.
  • థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.