ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబుకు హరోంహర అనే సినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా కుప్పం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా థియేటర్లలో కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. పలు ఓటీటీ సంస్థలు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు, ఆహా, ఈటీవి విన్ వారు ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకోగా ప్రస్తుతం మూడు ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈసినిమా ఓటీటీలో కూడా తన ప్రభంజనం కొనసాగిస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చిన దగ్గర నుండీ ఓటీటీ లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా నేషనల్ లెవల్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు
తాజాగా ప్రైమ్ వీడియోలో 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది హరోం హర. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా.. సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: