పుష్ప 2 సినిమా రిలీజ్ కాకముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఫస్ట్ లుక్ తోనే ఖాతా తెరిచిన చిత్రయూనిట్ అది కొనసాగిస్తూనే ఉంది. ఇక పుష్ప పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ఇప్పుడు పుష్ప2 పాటలు కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పుష్ప పుష్ప సాంగ్, సూసేకి సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టుకుంది. రీసెంట్ గానే పుష్ప పుష్ప సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు సూసేకి సాంగ్ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈసినిమా 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నట్టు నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. అయితే ఈ మధ్య ఈసినిమా షూటింగ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్పెక్టాక్యులర్ యాక్షన్ క్లైమాక్స్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తికానున్నట్టు తెలుస్తుంది.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: