మెకానిక్ రాకీ నుండి గుల్లెడు గుల్లెడు ఫుల్ సాంగ్ రిలీజ్

విశ్వక్ సేన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ సినిమా తరువాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈసినిమా కూడా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో మెకానిక్ రాకీ సినిమా ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ అప్పుడప్పుడు అప్ డేట్లు ఇస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చింది. గుల్లెడు గుల్లెడు అంటూ వచ్చిన ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట అయితే ఆకట్టుకుంటుంది. సుద్దాల అశోక్ తేజ్ రాసిన ఈపాటను మంగ్లీ పాడటం జరిగింది.

కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీ‌నాధ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి ఈసినిమాను నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో సునీల్, నరేష్, రోడీస్ రఘురాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనోజ్ కటసాని సినిమాటోగ్రాఫర్ గా.. అన్వర్ అలీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమా ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ దక్కించుకొని సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 31వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.