ఎన్టీఆర్ దేవర నుండి వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ కావడంతో ఎక్స్ లెంట్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 40మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం యూట్యూబ్ లో మొదటిస్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.అంతేకాదు వరల్డ్ వైడ్ గా మూడో స్థానం లో వుంది.ఇక ఈసాంగ్ తెలుగులో అత్యధిక వ్యూస్ ను సాధించిన మూడో లిరికల్ సాంగ్ గా రికార్డు సాధించింది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
24గంటల్లో తెలుగు వెర్షన్ 15.68మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంది.ఈ జాబితాలో గుంటూరు కారం నుండి వచ్చిన ధమ్ మసాలా 17.42మిలియన్ల వ్యూస్ తో సర్కారు వారి పాట పెన్నీ సాంగ్16.38 మిలియన్ల వ్యూస్ తో రెండవ స్థానంలో వుంది.మొత్తానికి అయితే దేవర మ్యూజిక్ విషయంలో అనిరుధ్ తన మీద వున్న అంచనాలను నిలబెట్టుకుంటున్నాడు.మొదటి సాంగ్ ఫియర్ లాగే సెకండ్ సాంగ్ కూడా అదరగొడుతుంది.
ఇక దేవర షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈనెలలో కంప్లీట్ కానుంది.కొరటాల శివ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్,యువసుధా ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.దేవర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: