టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్లను అందుకున్నాయి. ఆ తరువాత వెంటనే రెండు సినిమాలను సైట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, లైలా సినిమాలతో బిజీగా ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో సినిమాను లైనప్ లో పెట్టాడు. తాజాగా విశ్వక్ సేన్ 13వ సినిమాగా ఈసినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను శ్రీధర్ గంటా డైరెక్ట్ చేస్తుండగా.. ఈ మేరకు ఓ పవర్ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ని బట్టి ఇందులో విశ్వక్ సేన్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మరోవైపు రామ్ నారాయణ్ దర్శకత్వంలో లైలా సినిమా వస్తుంది. ఈసినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు తనిష్క్ బగ్చి సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్.. వాసుదేవ మూర్తి రైటర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: