కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సినిమాలు రావటం అరుదుగా మారుతున్న తరుణంలో, కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా, నవ్వుల పండుగను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమైంది ప్రెస్టీజియస్ బ్యానర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు చిత్ర యూనిట్ పిఠాపురంలో గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ ‘ఆయ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.. హీరో నార్నే నితిన్, నయన్ సారిక, నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ అంజి కె.మణిపుత్ర, కో ప్రొడ్యూసర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఆయ్.. ఇది పక్కా గోదావరి జిల్లాల సినిమా. రేపు సినిమాను థియేటర్స్‌లో చూసేటప్పుడు ఒక్కరూ కూడా కూర్చోరు. కిందపడి నవ్వుతుంటారు. ప్రేక్షకులందరూ సినిమా థియేటర్ నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారు. అందుకు నాదీ గ్యారంటీ” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “పిఠాపురంలో సినీ వేడుకను నిర్వహించి కొత్త అడుగుకి వేశాం. భవిష్యత్తులో ఈ బాటలో మరింత మంది అడుగులు వేస్తారని నమ్ముతున్నాను. రామ్ మిర్యాల గారిది పిఠాపురం అనేది నాకు తెలియదు. ఈ సినిమా సందర్భంలో ఆయన్ని కలిసినప్పుడే తెలిసింది. ఇక్కడ వ్యక్తి కాబట్టే నాయకి అనే సాంగ్‌తో పాటు మరో సాంగ్‌ను అద్భుతంగా కంపోజ్ చేశారు’’ అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: