మాస్ మహారాజా రవితేజ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా భాగ్య శ్రీ బోర్సే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాకు హైప్ తీసుకొచ్చిపెట్టింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, మూడు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఆగష్ట్ 7వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుది.
కాగా ఈసినిమాలో ఇంకా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
ఇదిలా ఉండగా ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ తో పాటు పలు సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఈ పోటీని తట్టుకొని ఈసినిమా ఏ మేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: