ముందు ఈ పాటను బాలు గారితో పాడించాలని అనుకున్నాం, కానీ..

Baby Movie Credit Goes To Producer SKN, Says Director Sai Rajesh

టాలీవుడ్ యంగ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు ట్యాలెంటెడ్ నటి వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్ కు గానూ 5 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది బేబి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో బేబి మూవీ టీమ్ మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి, చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ సహా అవార్డ్స్ గెలుచుకున్న లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ శ్రీరామచంద్ర, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. “మా బేబి సినిమాకు ఫిలింఫేర్ లో 8 నామినేషన్స్ కు 5 అవార్డ్స్ దక్కడం సంతోషంగా ఉంది. అనంత్ శ్రీరామ్ గారికి తప్ప మా అందరికీ ఇది ఫస్ట్ ఫిలింఫేర్. బేబి సినిమాను ఫస్ట్ 2 వీక్స్ మీడియా తన భుజాలపై మోస్తే అక్కడి నుంచి ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లారు. మా సినిమాకు క్రిటిక్స్ మెచ్చిన బెస్ట్ మూవీ అవార్డ్ దక్కింది. అందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఓ రెండు మేఘాలిలా పాటకు అనంత్ శ్రీరామ్ గారు 3 వెర్షన్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కు నిరీక్షణ మూవీ రిఫరెన్స్ ఇచ్చా. ఆయన అనేక ట్యూన్స్ ఇచ్చిన తర్వాత ఈ పాట సెలెక్ట్ చేసుకున్నా. ముందు ఈ పాటను బాలు గారితో పాడించాలని అనుకున్నాం. కానీ ఆయన స్వర్గస్తులవడంతో శ్రీరామచంద్రను సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పాటను ముందు పిల్లలతో పాడించాం. ఆ తర్వాత శ్రీరామచంద్ర పాడారు. రెండూ బాగున్నాయి. రెండూ కలిపి చేయమని విజయ్ కు చెప్పాను. అలా ఈ పాట వచ్చింది” అని తెలిపారు.

“బేబి సినిమా చేసేప్పుడు మోరల్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు మా మారుతి గారు. నువ్వొక కల్ట్ మూవీ చేస్తున్నావు అని ఎంకరేజ్ చేశారు. వైష్ణవి చైతన్య బాగా పర్ ఫార్మ్ చేసింది. ఆమెకు అవార్డ్ రావడం సంతోషంగా ఉంది. బేబికి వచ్చే క్రెడిట్ తా నా మిత్రుడు ఎస్ కేఎన్ కే చెందుతుంది” అని అన్నారు డైరెక్టర్ సాయి రాజేశ్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.