‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘తెలుసు కదా’ చిత్రాన్ని పట్టాలెక్కించేసాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేస్తోంది. సిద్దూ స్టార్‌డమ్‌కు అనుగుణంగా ఆమె ఈ స్క్రిప్ట్‌ను రూపొందించింది. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హరోయిన్స్‌గా నటిస్తుండగా.. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌కు పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘తెలుసు కదా’ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. కాగా సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ కోసం మరింత స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు. రాశి ఖన్నా మొదటి రోజు షూటింగ్‌లో సిద్దూతో కలిసి జాయిన్ అయింది. ఇక ప్రారంభ షెడ్యూల్ 30 రోజులు సాగనుండగా.. ఇందులో కీలకమైన టాకీ సన్నివేశాలతో పాటు కొన్ని పాటలను చిత్రీకరించనున్నారు.
ప్రీ-ప్రొడక్షన్ చిత్రం యొక్క గ్రాండ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌ను సూచిస్తుంది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో మంచి గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణుల బృందం ఉంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని, జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ చిత్రానికి సహకరిస్తుండగా.. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనింగ్ నిర్వహిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: