ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చాలా గ్యాప్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న దేవర సెకండ్ సాంగ్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈసాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఈ సాంగ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇచ్చారని చెప్పొచ్చు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ అయి 24 గంటలు కూడా కాకముందే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈపాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసాంగ్ కు ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో మరోవైపు కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. దీనిపై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ తన ఎక్స్ ద్వారా స్పందిస్తూ 24 గంటల నుండి ఈసాంగ్ లూప్ లో ఉంది.. జోష్ ఎలా ఉంది బాయ్.. అన్న తారక్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.. జాన్వీని చూస్తే ముద్దొస్తుంది..ఇంకా ఎవరు ఎలా అనుకొని.. దేనితో కంపేర్ చేస్తే మనకి ఏంటి బాయ్స్ అంటూ పోస్ట్ లో పేర్కన్నాడు. కాగా ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత నాగవంశీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈసినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 27 తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: