ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. స్టైలిష్ డైరెక్షన్,ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైయింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ ను ఆగష్ట్ 4వ తేదీన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అన్ని కమర్షియల్ హంగులతో ఆదరగొట్టింది. లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ అయితే, మదర్ సెంటిమెంట్ మరో కీ ఎలిమెంట్. అలాగే మూవీలో పూరి ట్రేడ్‌మార్క్ మాస్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. వన్‌లైనర్లు బుల్లెట్‌లా పేలాయి. పూరి టేకింగ్ చాలా స్టైలిష్‌గా వుంది. సినిమా విజువల్‌గా అద్భుతంగా వుంది. శివలింగం వద్ద క్లైమాక్స్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. దీంతో ఈసినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
కాగా ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: