కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సినిమాలు రావటం అరుదుగా మారుతున్న తరుణంలో, కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా, నవ్వుల పండుగను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమైంది ప్రెస్టీజియస్ బ్యానర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు చిత్ర యూనిట్ పిఠాపురంలో గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ ‘ఆయ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో.. హీరో నార్నే నితిన్, నయన్ సారిక, నిర్మాత బన్నీ వాస్, డైరెక్టర్ అంజి కె.మణిపుత్ర, కో ప్రొడ్యూసర్ బాలు తదితరులు పాల్గొన్నారు.
హీరో నార్నే నితిన్ మాట్లాడుతూ “ఆయ్ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మమ్మల్ని చెట్లు ఎక్కించటం, బురదలో పడేయటం వంటి పనులను మా డైరెక్టర్ చేశారు. ఆయనపై కోపాన్ని మళ్లీ తీర్చుకుంటాను (నవ్వుతూ). మా కష్టానికి ఫలితాన్ని మీరు అందరూ, సినిమా సక్సెస్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ ఉందంటే కారణం మా డైరెక్టర్, నిర్మాతలే. అంకిత్, కసిరెడ్డి లేకపోతే ఈ సినిమా లేదనే చెప్పాలి. పిల్లర్స్‌లా వాళ్లు కష్టపడ్డారు. ఈ సందర్భంగా వాళ్లకి థాంక్స్. నయన్ సారిక తెలుగు అమ్మాయి కాకపోయినా, తను ఇరగ్గొట్టేసింది. రేపు సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: