వయనాడ్ విపత్తు బాధితులకు అండగా అన్ని ఇండస్ట్రీల నుండి సెలబ్రిటీలు అందరూ ముందుకొచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త కూడా వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత సాయం చేసింది. వయనాడ్ లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు చెక్ ను సంయుక్త అందజేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సంయుక్త సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – వయనాడ్ ప్రజలకు ఎదురైన విపత్తు ఎంతో బాధను కలిగిస్తోంది. ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలబడి, నా వంతు సపోర్ట్ అందిస్తున్నా. విశ్వశాంతి ఫౌండేషన్ వారు వయనాడ్ లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయం అందించా. వయనాడ్ కు సపోర్ట్ గా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అక్కడి ప్రజలు ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ పేర్కొంది.
కాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు సంయుక్త శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఇదే ఫామ్ లో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో వస్తున్న మహారాగ్ని. ఈసినిమాలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: