మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే ‘టిల్లు స్క్వేర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ నటి సంగీత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ పోస్టర్, అనుపమ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ గ్లింప్స్ తోనే ఇదేదో కొత్త కథ అనే ఆసక్తిని క్రియేట్ చేయగలిగింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో తాజాగా ‘పరదా’ చిత్రం నుంచి సంగీత పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో సంగీత రెండు చేతుల్లో అట్లకాడ, గరిటెలను పట్టుకుని హోమ్లీగా కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమతో పాటు సంగీత లుక్ గమనిస్తే.. ఇందులో వారు డి-గ్లామర్ పాత్రలలో కనిపించనున్నట్లు అర్ధమవుతోంది. ఈ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. ఇక ఈ మూవీతో ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
కాగా ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి మరియు శ్రీధర్ మక్కువతో కలిసి నిర్మాత విజయ్ డొంకాడ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: