మ్యాడ్ తో హిట్ అందుకున్న యంగ్ హీరో నార్నె నితిన్ నుండి వస్తున్న రెండో సినిమా ఆయ్.గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.వీటికి తోడు గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమాకావడంతో హైప్ క్రీయేట్ అయ్యింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అనుమానాలను రేకెత్తించింది.ఆగస్టు 15న విడుదలకానుందని ముందే అనౌన్స్ చేశారు.కానీ అదే రోజు డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ కూడా దిగుతుండడంతో ఆయ్ వెనక్కివెళ్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే నిర్మాతలు మాత్రం పోటీ ని లెక్క చేయడం లేదు.కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాను వచ్చే నెల15నే రిలీజ్ చేస్తామని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.దాంతో ఆయ్ కూడా పోటీలో నిలువనుంది.అంజి కె మణిపుత్ర తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించగా రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.
ఇక నితిన్ ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్ కూడా చేస్తున్నాడు.మ్యాడ్ స్కోర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో నితిన్ తోపాటు మ్యాడ్ లో నటించిన సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























