టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. మెకానిక్ రాకీ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్‍ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జూలై 28న గ్లింప్స్‌ను లాంచ్ చేయనున్నట్టు హీరో విశ్వక్ సేన్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విశ్వక్ లుక్ అదిరిపోయింది.
హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
కాగా మెకానిక్ రాకీ దీపావళి రేసులో ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ పండుగ కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇక మెకానిక్ రాకీ ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: