టాలీవుడ్ సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ (ధరమ్) తేజ్.. రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోనే అని అనేక పర్యాయాలు నిరూపించుకున్నాడు. ఇటీవలే ఇద్దరు అనాధ పిల్లల ట్రీట్‌మెంట్‌కు సాయం అందించి మరోసారి మానవత్వం చాటుకున్నాడు. ఇక గతేడాది తన జన్మదినం (అక్టోబర్ 15) సందర్భంగా.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల కుటుంబాలకు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు రూ.10 లక్షలు చొప్పున విరాళం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా సాయి దుర్గ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సుప్రీమ్ హీరో తాజాగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు విరాళం అందించడమే కాకుండా.. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావల శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆమెకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ తాజాగా పావల శ్యామలను కలిసి ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.
సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో నటి పావల శ్యామల ఎమోషనల్ అయ్యారు. తన ధీనస్థితి గురించి చెబుతూ ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలాంటి పరిస్థితులో సాయి దుర్గ తేజ్ తనను గుర్తు పెట్టుకుని మరీ సాయం చేయడం గొప్ప విషయమని ఎమోషనల్ అయ్యారు. ఇక సాయి దుర్గ తేజ్‌తో వీడియో కాల్‌లో నటి శ్యామల మాట్లాడుతూ కన్నీరు పెట్టేసుకున్నారు.
ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ అధైర్యపడొద్దని, వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఆమెకు భరోసానిచ్చారు. అందరూ సాయం చేస్తారని, తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి గారు చేసిన ఆర్థిక సాయాన్ని కూడా నటి పావల శ్యామల గుర్తు చేసుకున్నారు. ఇక ‘యాక్సిడెంట్ జరిగినప్పుడు.. మీరు బాగుండాలని, ఏమీ కాకూడదని ఆ దేవుడ్ని ప్రార్థించానంటూ నటి పావల శ్యామల చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.
ఆమె ప్రేమకు, మాటలకు సాయి దుర్గ తేజ్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కొన్నేళ్ల క్రితం సాయి దుర్గ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన విషయం గుర్తుండే వుంటుంది. ఈ విధంగా సాయి దుర్గ తేజ్ మేనమామ, మెగాస్టార్ చిరంజీవి వలే సమాజ సేవలో పాలుపంచుకుంటూ సాటి హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడని పలువురు నెటిజన్లు తేజ్‌ను ప్రశంసిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: