పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోలు కొంతమందే ఉంటారు. వారిలో తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. శివ పుత్రుడు నుండి ఆయన చేస్తున్న పాత్రల్లో వేరియేషన్స్ ను చూస్తే అర్థమవుతుంది. సినిమాకు అవసరమైతే ఎలాంటి మేకోవర్ చేసుకోడానికి అయినా రెడీ అయిపోతాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రతోనే రాబోతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాలో విక్రమ్ కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒక పక్క ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇంతవరకూ అయితే రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ కానున్నట్టు మాత్రం వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా ఇన్ని రోజుల తరువాత ఈసినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. తాజాగా చిత్రయూనిట్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించింది. ముందు నుండీ అనుకున్నట్టే ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























