సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది కుబేర.దాంతో షూటింగ్ తుది దశకు చేరింది.ప్రస్తుతం హైదరాబాద్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో నైట్ షూట్ జరుగుతుంది.ఇందులో ధనుష్ ,నాగార్జున ,రష్మిక మందన్నపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరో 20రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది.వచ్చే నెలలో ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ కానుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన అప్డేట్స్ అంచనాలను పెంచేశాయి.థియేట్రికల్ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.కుబేర రెగ్యులర్ శేఖర్ కమ్ముల సినిమాలకు భిన్నంగా ఉండనుంది.థ్రిల్లింగ్ కంటెంట్ తో రానుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ నిర్మిస్తున్నారు.పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఇక శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాను కూడా ఇదే బ్యానర్ లో చేయనున్నాడు.త్వరలోనే ఆ వివరాలు వెలుబడనున్నాయి.మరోవైపు యంగ్ హీరోలు శేఖర్ కమ్ముల తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.మరి ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో చేస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























