ప్రస్తుతం నాగచైతన్య మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈమధ్య కాలంలో నాగ చైతన్యకు సాలిడ్ హిట్ పడింది లేదు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా తండేల్. నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా రిలీజ్ పై ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. నిజానికి తండేల్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినప్పుడు డిసెంబర్ లో రిలీజ్ కు పెద్దగా సినిమాలు రాలేదు. అయితే ఇప్పుడు డిసెంబర్ నెల బిజీ అయిపోతుంది. పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. పుష్ప ది రూల్, రాంచరణ్ గేమ్ ఛేంజర్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలతోపాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా డిసెంబర్‌లోనే రాబోతున్నాయి. ముందు ముందు ఇంకెన్ని సినిమాలు క్యూ కడతాయో చూడాలి. ఈనేపథ్యంలోనే తండేల్ టీమ్ రిలీజ్ డేట్ ను మార్చాలన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 2025 జనవరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























